News March 3, 2025
ఆట వస్తువుల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన

నెల్లూరు నగర శివారులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని మండల పరిషత్ పాఠశాలకు సంబంధించిన సమస్యలను HM, విద్యార్థులు మంత్రికి ఏకరువు పెట్టారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి విశాలంగా ఉన్న పాఠశాల మైదానంలో ఆట వస్తువులు ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ మంత్రి నారాయణ పాఠశాలలో వాటికి శంకుస్థాపన చేశారు.
Similar News
News April 22, 2025
త్వరలో అంగన్వాడి పోస్టుల భర్తీకి చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ICDS అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించి పిల్లల ఎత్తు, బరువు పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News April 22, 2025
మే 8 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు. పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.
News April 22, 2025
కొడవలూరు రైలు కింద పడిన గుర్తుతెలియని వ్యక్తి

తలమంచి – కొడవలూరు రైల్వే స్టేషన్ మూడవ లైన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుని వయసు సుమారు 42-45 ఉంటుందని, పింక్ పసుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు లుంగీ ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని సూచించారు.