News March 3, 2025
ఆట వస్తువుల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన

నెల్లూరు నగర శివారులోని భగత్ సింగ్ కాలనీలో శనివారం మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని మండల పరిషత్ పాఠశాలకు సంబంధించిన సమస్యలను HM, విద్యార్థులు మంత్రికి ఏకరువు పెట్టారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి విశాలంగా ఉన్న పాఠశాల మైదానంలో ఆట వస్తువులు ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ మంత్రి నారాయణ పాఠశాలలో వాటికి శంకుస్థాపన చేశారు.
Similar News
News March 20, 2025
నెల్లూరు: ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.150 దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు.
News March 20, 2025
నెల్లూరు: 10 మంది టీచర్లు సస్పెండ్

Open 10th Examsలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలో 10 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నట్లు RJD లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని TRR ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో Open 10th Exams జరుగుతుండగా RJD తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌ను ఎంకరేజ్ చేసిన 10మంది టీచర్లను సస్పెండ్ చేయగా, నలుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.
News March 20, 2025
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నెల్లూరు జిల్లా వాసి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ గుండ్రాత్ సతీశ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం, మహిమలూరు గ్రామానికి చెందిన DRDO మాజీ ఛైర్మెన్, భారత రక్షణ శాఖ సలహాదారు గుండ్రాత్ సతీశ్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడంపై ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.