News December 29, 2024

ఆడంబరాలు వద్దు.. సేవా కార్యక్రమాలు చేద్దాం: ఎమ్మెల్యే శిరీష

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సేవా కార్యక్రమాలకే తాను ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పూలబొకేలు, మిఠాయిలు, శాలువలతో సత్కారాలు చేయవద్దని కోరారు. ఆ నగదును పేద విద్యార్థులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని ఆమె పేర్కొన్నారు.

Similar News

News January 23, 2025

జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ

image

జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.

News January 23, 2025

బొగాబొంద గ్రామంలో అత్యంత విషపూరితమైన పాము

image

మందస మండలం బొగాబంద గ్రామంలో అత్యంత విషపూరితమైన రణపస పాము కనిపించడం కలకలం రేపింది. స్థానికులు దానిని కొట్టి చంపారు. ఇది కరిస్తే కొద్ది రోజులకు శరీరంపై నల్ల, బంగారం వర్ణంలో మచ్చలు వస్తాయని, ఆపై శరీరం ముక్కలుగా రాలిపోతుందని స్థానికులు తెలిపారు. నల్లటి మచ్చలతో భయం గొలిపేలా ఉండే ఈ పాము శాస్త్రీయ నామం ‘బంగారస్ ఫాసియాటస్’.

News January 23, 2025

జి.సిగడాం: అంత్యక్రియలకు ఏర్పాటు.. అంతలో ట్విస్ట్

image

మండలంలోని సీతంపేటకి చెందిన ధర్మవరపు అప్పారావు(85) అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే రోగం నయం కాకపోవడంతో బుధవారం హాస్పిటల్ నుంచి గ్రామానికి అంబులెన్స్ లో తీసుకొస్తుండగా చలనం లేకపోవడంతో అప్పారావు మృతి చెందినట్లు బంధువులు భావించారు. ఆపై అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా ఆయన లేచి కూర్చోవడంతో అంతా షాకయ్యారు. ఆయన ఇంకా బతికే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందించారు.