News March 16, 2025

ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి

image

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని, చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. గాంధీనగర్​ సురభి బాలవిహార్​ స్కూల్​ దగ్గర SRK గ్రూప్​ ఆఫ్​ స్కూల్స్​ ఉదాన్​ ఉత్సవ్​–2025 కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు.MLA ముఠా గోపాల్​, రిటైర్డ్​ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్​ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News March 18, 2025

కడియం: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

కడియం మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్న(60) మనవరాలు వరుసయ్యే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. తల్లి వేరే దేశంలో ఉంటోంది. బంధువుల ఇంటి వద్ద ఉంటున్న బాలికపై సదరు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు.

News March 18, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర 41.5°C నమోదు కాగా, ఇందుర్తి, చిగురుమామిడి 40.1, కొత్తపల్లి-ధర్మారం, ఈదులగట్టేపల్లి 40.0, రేణికుంట 39.8, నుస్తులాపూర్ 39.7, ఖాసీంపేట 39.6, జమ్మికుంట 39.3, బురుగుపల్లి 39.1, వెంకేపల్లి 38.6, వీణవంక 38.3, కొత్తగట్టు 37.9, తాడికల్ 37.8, పోచంపల్లి 37.7, చింతకుంట, KNR 37.6, గట్టుదుద్దెనపల్లె, ఆసిఫ్నగర్ 37.3°C గా నమోదైంది.

News March 18, 2025

రన్యారావు కేసు.. తెలుగు నటుడు అరెస్ట్

image

కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్టు చేశారు. ‘పరిచయం’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రన్యారావు వెనుక తరుణ్ కింగ్‌పిన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!