News February 27, 2025

ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న చిత్తూరు కలెక్టర్

image

గంగాధర నెల్లూరులోని ఓ దంపతులకు రక్షిత, హేమశ్రీ అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కొన్ని అనివార్య కారణాలతో తల్లిదండ్రులు విడిపోయి వారి జీవితాలను మరొకరితో పంచుకున్నారు. ఈ కారణంగా అనాథలైన రక్షిత, హేమశ్రీ బాగోగులు వారి తాతయ్య చూసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్.. ఇద్దరి పిల్లల ఉన్నత విద్య బాధ్యత తానే తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పలువురు కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.

Similar News

News February 27, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

image

మార్చి 1న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైయుజన్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.

News February 27, 2025

చిత్తూరులో వృద్ధురాలి సూసైడ్

image

వృద్ధురాలు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చిత్తూరు వైఎస్ నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా జ్ఞానమని (65) అనే వృద్ధురాలు తీవ్రమైన నడుము నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మనవడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. మార్గ మద్యమంలో మృతి చెందగా, కేసు నమోదు చేశామన్నారు.

News February 26, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

image

ఏపీ సీఎం చంద్రబాబు మార్చి 1న జీడీ నెల్లూరులో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ వాసంతి తెలిపారు. సీఎం కాన్వాయ్, హెలిపాడ్, పెన్షన్ల పంపిణీ స్థలం వద్ద భద్రతను పరిశీలించామన్నారు.

error: Content is protected !!