News March 27, 2025
ఆడబిడ్డ పుట్టడం అదృష్టం: ఖమ్మం కలెక్టర్

ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఇంటిలో ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే విధంగా జిల్లాలో ‘మా పాప-మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ దంపతుల కుమార్తెను ఎత్తుకొని, సంబురం వ్యక్తం చేశారు.
Similar News
News October 7, 2025
ఖమ్మ: 5 పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం: కలెక్టర్

చింతకాని మండలంలోని 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రత్యేక యాప్ ద్వారా పిల్లల రీడింగ్ సామర్థ్యం పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3–4 గంటల రీడింగ్ ఫోకస్ పీరియడ్ నిర్వహించి, ప్రతి విద్యార్థి చదివే సామర్థ్యం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 6, 2025
బ్యాలెట్ పేపర్ల ముద్రణకు 8లోపు టెండర్లు దాఖలు చేయాలి: కలెక్టర్

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి అక్టోబర్ 8లోపు టెండర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన నాలుగు రోజుల్లోపు బ్యాలెట్ పేపర్లను ముద్రణ చేయాలని ఆదేశించారు. ముద్రణకు అవసరమైన సింబల్ బ్లాక్స్, పింక్, వైట్ పేపర్ వంటి సామాగ్రిని సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 6, 2025
స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రెసీ కాలేజ్, ఖమ్మంలోని sr&bgnr కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.