News January 22, 2025
ఆడయినా, మగయినా సమానంగా చూడాలి: డీఎంహెచ్వో

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారిణి డాక్టర్ జి అన్నా ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భస్థపూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టమునుసరించి స్కానింగ్ కేంద్రాలలో శిశువులను నిర్దారించకూడదన్నారు. ఆడయినా, మగయిన సమానంగా చూడాలన్నారు.
Similar News
News November 15, 2025
అతి వేగం ప్రమాదకరం: వరంగల్ ట్రాఫిక్ పోలీస్

థ్రిల్ కోసం వేగం పెంచి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలను స్వాగతించవద్దని వారు కోరారు. తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని, కుటుంబ సభ్యుల కోసమైనా సురక్షితంగా గమ్యం చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News November 15, 2025
NLG: జీతాల అందక 8 నెలలు

నల్గొండ జిల్లాలో పశుసంవర్ధక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాల మిత్రలకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 8 నెలలుగా తమకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో అప్పులు చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. జిల్లాలో సుమారు 100 మందికి పైగానే గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 15, 2025
GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్‌గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.


