News January 22, 2025

ఆడయినా, మగయినా సమానంగా చూడాలి: డీఎంహెచ్వో

image

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారిణి డాక్టర్ జి అన్నా ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భస్థపూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టమునుసరించి స్కానింగ్ కేంద్రాలలో శిశువులను  నిర్దారించకూడదన్నారు. ఆడయినా, మగయిన సమానంగా చూడాలన్నారు.

Similar News

News February 12, 2026

గద్వాల: ‘కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి’

image

కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలపై నిర్లక్ష్య వైఖరిని వీడాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అన్నారు. MGNREGS, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలన్నారు. బీజేపీ కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కొత్త చట్టాలు కార్మికుల ఉపాధి, భద్రత, జీవన విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కార్మికులు చేసే నిరసనకు ఆయన సంఘీభావాన్ని తెలిపారు.

News February 12, 2026

110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాల పంపిణీ

image

110 మంది గ్రామ రెవెన్యూ (గ్రేడ్-II) అధికారులు గ్రేడ్-Iగా పదోన్నతి పొందినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో 110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించి లక్ష్యసాధనలో సత్ఫలితాలు సాధించాలన్నారు.

News February 12, 2026

NZB: ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు: కలెక్టర్

image

స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు.