News March 2, 2025

ఆత్మకూరులో చికెన్ ధరలు ఇలా..!

image

ఆత్మకూరు పట్టణంలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ లైవ్ చికెన్ ధర రూ. 96 ఉండగా స్కిన్‌తో కలిపి కిలో చికెన్ ధర రూ.160 పలుకుతోంది. అదే క్రమంలో స్కిన్ లెస్ కిలో చికెన్ ధర రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఇటీవల చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టి మటన్, చేపలకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ఆత్మకూరులో కిలో మటన్‌ధర రూ. 800 లకు విక్రయిస్తున్నారు.

Similar News

News February 26, 2026

మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

image

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

News February 26, 2026

బాధ్యతలు స్వీకరించిన పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య

image

మున్సిపల్ కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పట్టణ ప్రగతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

News February 26, 2026

పేటెంట్ ఎక్స్‌పైరీ.. తగ్గనున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ధరలు!

image

భారత్‌లో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ధరలు తగ్గనున్నాయి. వీటిలో వినియోగించే సెమాగ్లుటైడ్ పేటెంట్ MAR 20తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో దీని జనరిక్ వెర్షన్ తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా వంటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం నోవోనార్‌డిస్క్ సంస్థకు చెందిన Wegovy, Ozempicలలో సెమాగ్లుటైడ్ వినియోగిస్తున్నారు. వీటి ధర ₹8వేల నుంచి ₹25వేల వరకూ ఉంది. జనరిక్ వెర్షన్ వస్తే ధర 50% వరకూ తగ్గనుంది.