News March 20, 2024
ఆత్మకూరులో ముగ్గురు వాలంటీర్లపై వేటు

ఆత్మకూరు నియోజకవర్గంలోని ముగ్గురు వాలంటీర్లపై వేటు వేసినట్లు రిటర్నింగ్ అధికారిని ఆర్డీవో మధులత తెలిపారు. చేజర్ల మండలం పాడేరు గ్రామంలో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారు. సంగం MPDO కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి ఓ వాలంటీర్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
Similar News
News April 22, 2025
నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News April 21, 2025
చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News April 21, 2025
వడ్డీతో సహా చెల్లిస్తాం: మేకపాటి

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని వైసీపీ ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.