News August 17, 2024

ఆత్మకూరులో మేడపై బట్లలు ఆరేసేందుకు వెళ్లిన మహిళ మృతి

image

దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ జారి రెండో అంతస్తు నుంచి కిందపడి వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని బ్రాహ్మణవీధిలో ఆర్టీసీ ఉద్యోగి సునీల్, మనోజ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మనోజ తాము ఉంటున్న భవన రెండో అంతస్తులో దుస్తులను ఆరేయసాగారు. ఈ తరుణంలో మేడపై నుంచి తీగలను తాకుతూ కింద పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యారు.

Similar News

News October 16, 2025

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.

News October 16, 2025

కావలి : పట్టపగలే ఇంట్లో దొంగతనం

image

కావలిలోని వడ్డెపాలెం రైల్వే క్వార్టర్స్ నందు రైల్వే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శైలజ ఇంట్లో మధ్యాహ్నం దొంగతనం జరిగింది. వారి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లి ఇంటికి రాగ ఇంటి వెనుక నుంచి తలుపులు బద్దలు కొట్టి ఇంటిని దోచుకున్నారు. రూ.30 వేల నగదు, 3 బంగారు ఉంగరాలు, వెండి మొలతాడు కనిపించట్లేదన్నారు. స్థానిక ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 16, 2025

నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

image

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్‌ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.