News May 25, 2024
ఆత్మకూరులో యువకుడి మృతి

ఆత్మకూరులో శుక్రవారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హుస్సేన్ (25) స్థానిక పెద్ద మసీదు ప్రాంతంలోని ఓ ఇంటికి అద్దాలు బిగించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తూ.. ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుస్సేన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చినట్లు ఎస్ఐ ముత్యాల రావ్ తెలిపారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు: దుబాయ్లో ఉద్యోగ అవకాశాలు

దుబాయ్లో హోమ్ కేర్ నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ కయ్యం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సంవత్సరాల లోపు ఉండి BSc నర్సింగ్ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఈ ఉద్యోగ అవకాశం రెండేళ్లు కాంటాక్ట్ ప్రాతిపదికన ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News December 2, 2025
నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
News December 2, 2025
నేడు నెల్లూరు జిల్లా బంద్

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.


