News March 6, 2025
ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.
Similar News
News March 28, 2025
విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్: డీఈవో

పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో పాఠశాలల విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎండవేడిమికి గురికాకుండా శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి విద్యార్థి తగినంత మంచినీటిని తాగేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
News March 27, 2025
జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్

కర్నూలు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్‌గా వైసీపీ నేత మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్‌తో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పీ.రంజిత్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
News March 27, 2025
కర్నూలు జిల్లాలో ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం

కర్నూలు జిల్లాలో వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. రెండు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వెల్దుర్తి ఎంపీపీగా దేశాయి లక్ష్మిదేవమ్మ, తుగ్గలి ఎంపీపీగా రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ ఉప సర్పంచ్‌గా శాకీరాను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఎన్నికకు వైసీపీ తరఫున మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.