News October 29, 2024
ఆత్మకూరు: ట్రాక్టర్ కిందపడి వ్యక్తి స్పాట్‌డెడ్
ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నిక్కం కార్తీక్ (30) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం ట్రాక్టర్‌తో పొలం పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు టైర్ కింద పడిపోయాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు విలపించారు. కార్తీక్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 30, 2024
నెల్లూరు జిల్లాలోని ఓటర్ల సంఖ్య ఇదే.!
ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 19,44,157మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 9,51,122.. మహిళలు 9,92,825.. థర్డ్ జెండర్ 210 మంది ఉన్నారు. నవంబరులో అభ్యంతరాలు స్వీకరించి.. వచ్చే ఏడాది 6న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది.
News October 30, 2024
నెల్లూరు: దేవాలయాలకు నెయ్యి సరఫరాపై ఉన్నత స్థాయి కమిటీ
రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యిని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ డైరీల సంఘాలు, సంస్థ ప్రతినిధులతో చర్చించారు.