News March 28, 2024
ఆత్మకూరు: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టూరి శివ కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం ఉదయం పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం HYD కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News April 21, 2025
చిట్యాల: 25 ఏళ్ల తర్వాత అ‘పూర్వ’ కలయిక

చిట్యాల (M) ఉరుమడ్ల ZPHSలో 1998-99 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత దాదాపు 50 మంది ఒకేచోట చేరి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించారు. వేముల వెంకటేశం, కోనేటి యాదగిరి, పానుగుల్ల నరసింహ, కృష్ణ, యానాల సుధ, చంద్రకళ పాల్గొన్నారు. మీ స్నేహితులతో మీరేప్పుడు ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
News April 20, 2025
NLG: కమ్మని కల్లు.. మనసు జిల్లు!

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.