News December 17, 2024

ఆత్మకూరు: పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. జీతం రూ.1,10,000

image

ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి డైస్ సెంటర్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DMHO పెంచలయ్య తెలిపారు. వివరాలను spsnellore.ap.gov.in/notice/recruitment అనే వెబ్సైట్లో అప్లై చేయాలన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఈనెల 19వ తేదీ లోపు పెద్దాస్పత్రిలో డైస్ కేంద్రంలో అందించాలన్నారు. జీతం రూ.1,10,000 ఉంటుందన్నారు.

Similar News

News January 5, 2026

నెల్లూరు: ఒక్క రోజే 28 మంది వరకు అరెస్ట్.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడి పందేలు, పేకాల స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైదాపురం మండల పరిధిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, కావలిలో 5 మంది, ఉదయగిరిలో 6 మంది, రాపూరులో 7 మంది పోలీసులకు చిక్కారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

News January 5, 2026

నెల్లూరులో ‘స్పై’ హీరో సందడి

image

హీరో నిఖిల్ నెల్లూరులో సందడి చేశారు. మాగుంట లేఔట్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని చేపల పులుసు అంటే తనకు ఇష్టం అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

News January 5, 2026

నా విజయానికి కారణం చదువే : మంత్రి నారాయణ

image

మెరుగైన విద్య అందితేనే సమాజంలో గౌరవం, మంచి భవిష్యత్తు ఉంటాయని రాష్ట్ర మంత్రి పి. నారాయణ అన్నారు. నెల్లూరు కాపు భవన్‌లో బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు చదువే ఈ స్థాయిని ఇచ్చిందని వెల్లడించారు.