News April 8, 2025

ఆత్మకూరు ప్రైవేట్ ఆసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ

image

ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేసి పసికందును కోసి బయటకు తీశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లను ఆయన విచారించారు. ఈ ఘటనలో డాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు.

Similar News

News November 4, 2025

ఊట్కూర్ రైల్వే స్టేషన్ పుకార్లు తప్పు: ఎంపీ డీకే అరుణ

image

ఊట్కూర్ రైల్వే స్టేషన్ సాధన కోసం అఖిలపక్ష నాయకులు ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే (DPR)లో ఊట్కూర్ స్టేషన్ ఉందని, స్టేషన్ లేదనే ప్రచారం తప్పుడు సమాచారం అని స్పష్టం చేశారు. ఊట్కూర్‌లో క్రాసింగ్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

News November 4, 2025

సంగారెడ్డి: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్స్‌ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. సంగారెడ్డి కోర్టులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.

News November 4, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.