News February 7, 2026
ఆత్మకూరు: బిడ్డకు స్నానం చేయిస్తూ.. ఓట్లు అడుగుతూ..

మున్సిపల్ ఎన్నికల వేళ ఆత్మకూరు 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పుల్లరి మంజుల వినూత్నంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శనివారం వార్డులో పర్యటిస్తూ.. ఓ ఓటరు బిడ్డకు స్వయంగా స్నానం చేయించారు. ప్రజలు చేసే నిత్యవార్యాల్లో భాగస్వామ్యం అవుతూ, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థి చేస్తున్న ఈ ప్రయత్నం పట్టణంలో చర్చనీయాంశమైంది. నాయకులు అశోక్, అనిల్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
పనితీరులో పల్నాడు ఎంపీకి ఆరో స్థానం

MPల పనితీరుపై ‘రైజ్’ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో పల్నాడు MP లావు కృష్ణదేవరాయలు ఆరో స్థానంలో నిలిచారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయనకు 7.7 పాయింట్లు లభించాయి. పార్లమెంటులో సమస్యల ప్రస్తావన, నియోజకవర్గంలో లభ్యత వంటి అంశాల ప్రాతిపదికన ఈ స్కోరును వెల్లడించారు. పల్నాడు ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన కృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లా ఎంపీలలోనూ ఆకట్టుకునే పనితీరు కనబరుస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
News March 17, 2026
WGL: ఏఈలు తక్కువ.. బాధ్యతలు ఎక్కువ..!

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్ల కొరత నగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. నిబంధన ప్రకారం ప్రతి డివిజన్‌కు ఒక ఏఈ ఉండాలి. ప్రస్తుతం నగర పరిధిలో ఉన్న 66 డివిజన్లకు కేవలం 14 మంది ఏఈలు ఉన్నారు. దీంతో ఒక్కో ఏఈకి 8-10 డివిజన్లు ఇచ్చారు. అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరాలకు తోడుగా పన్నుల వసూళ్లకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. దీంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి.
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ స్వలింగ సంపర్కుడు: US

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ స్వలింగ సంపర్కుడని US ఇంటెలిజెన్స్ భావిస్తోంది. తన చైల్డ్‌హుడ్ ట్యూటర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని ట్రంప్‌తో చెప్పగానే ఆయన ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. వికీలీక్స్‌లోనూ ఓ ఇరాన్ లీడర్ నపుంసకత్వానికి చికిత్స కోసం UKకు వెళ్లినట్లు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. కాగా ఇరాన్‌లో స్వలింగ సంపర్కం నేరం.


