News February 28, 2025
ఆత్మకూరు: బ్రహ్మోత్సవాలకు బోట్ల రాక

ఆత్మకూరు పట్టణంలో త్వరలో జరగబోయే చర్ల పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమేశ్వర స్వామి చెరువులో విహరించేందుకు పిల్లలకు, పెద్దలకు ఆనందం కలిగించేందుకు, బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యులు బోట్ లను తెప్పించారు. ఇట్టి బోట్ లు పరమేశ్వర స్వామి చెరువులో విహరించనున్నాయి. వీటి రాకకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీహరి కి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 3, 2025
WGL: అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్..!

జిల్లాలోని దుగ్గొండి మండలం బంధంపల్లిలో సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీగా రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ములుగు మాజీ ఎస్ఐ పోరెడ్డి లక్ష్మారెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ సర్పంచ్‌గా పోటీకి నామినేషన్ పంపించారు. ఆన్లైన్లో ఫారం డౌన్లోడ్ చేసుకుని సంతకం చేసిన ఆయన, స్పీడ్ పోస్టు ద్వారా రిటర్నింగ్ అధికారి భద్రమ్మకు చేరేలా పంపించారు. లక్ష్మారెడ్డి భార్య సుభద్ర 2013-18లో ఇదే గ్రామానికి సర్పంచ్‌గా పని చేశారు.
News December 3, 2025
న్యూస్ రౌండప్

☞ కర్నూలు, నంద్యాల జిల్లాల టాప్ హెడ్‌లైన్స్
★ కర్నూలు-బళ్లారి రోడ్డును NHగా మార్చాలని కేంద్ర మంత్రికి TG భరత్ వినతి
★ RU పరిధిలో బీఈడీ ఫలితాలు విడుదల
★ సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై 925 మందిపై కేసులు
★ ఆలూరుకు కలెక్టర్ వస్తే సమాచారం ఇవ్వరా?: ఎమ్మెల్యే విరూపాక్షి
★ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో
★ కర్నూలు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం
★ శ్రీశైలంలో శివ స్వాముల రద్దీ
News December 3, 2025
అనకాపల్లి: ‘8,000 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాలి’

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో డిసెంబర్ 13వ తేదీ నాటికి 8,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్ అధికారులతో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న మ్యాజిక్ డ్రెయిన్లు, కంపోస్ట్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ పనులను వారం రోజులు లోగా పూర్తి చేయాలన్నారు. నీటి కుంటల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.


