News February 25, 2025
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్పేట్కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 18, 2025
గుంటూరు: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, వేగంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, కట్టుబడి ఉన్నామన్నారు.
News December 18, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

* కామారెడ్డి: ఎన్నికల పరిశీలకుడికి వీడ్కోలు పలికిన కలెక్టర్
* జుక్కల్: కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ బిజెపి నాయకులు
* కామారెడ్డి: ఎన్నికల్లో ఉద్యోగులు అంకితభావంతో పనిచేశారు
* బిక్కనూర్: పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే లెప్రసి సర్వే నిర్వహిస్తాం
* కామారెడ్డి: మీనాక్షి నటరాజన్ను కలిసిన షబ్బీర్ అలీ
* దోమకొండ: పెద్దపులి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి
News December 18, 2025
హౌసింగ్ బోర్డు LIG ఫ్లాట్ల విక్రయానికి నిర్ణయం

TG: వివిధ ప్రాంతాల్లోని 339 LIG ఫ్లాట్ల(FLAT)ను విక్రయించేందుకు హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. HYD గచ్చిబౌలిలో 111, వరంగల్లో 102, ఖమ్మంలో 126 ఫ్లాట్లను అమ్మనున్నట్లు బోర్డు VC గౌతం తెలిపారు. వాటి ధరలు గచ్చిబౌలిలో ₹26L-₹36.20L, వరంగల్లో ₹19L-₹21.50L, ఖమ్మంలో ₹11.25Lగా నిర్ణయించామన్నారు. ఆన్లైన్, మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని, వివరాలకు https://tghb.cgg.gov.inని సందర్శించాలని సూచించారు.


