News February 25, 2025
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 23, 2025
కల్వకుర్తి: అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎంపీటీసీ మృతి

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎమ్మెల్యే సొంత గ్రామం ఖానాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గార్లపాటి సరిత (46) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆమె ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఎంపీటీసీగా ఆమె గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
News March 23, 2025
దుబ్బాక: సైబర్ మోసానికి గృహిణి బలి

ఇంటి దగ్గర పార్ట్ టైం జాబ్ పేరుతో గృహిణి సైబర్ మోసానికి గురైన ఘటన దుబ్బాక పట్టణంలో ఇటీవల జరగగా, శనివారం కేసు నమోదు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. పోలీసుల వివరాలు.. డిసెంబర్ 29న తన ఇన్‌స్టాలో పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన ఓ లింకును ఓపెన్ చేసింది. విడతల వారీగా ఆమె రూ.59 వేలు వారి ఖాతాలకు పంపింది. మరికొంత డబ్బును పంపాలని సైబర్ నేరగాళ్లు కోరడంతో శనివారం దుబ్బాక పోలీసులను ఆశ్రయించింది.
News March 23, 2025
పరిగి: పది పరీక్ష రాస్తూ కళ్లు తిరిగి పడిన విద్యార్థి

దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి రిషిక పరిగి మున్సిపల్‌లోని జిల్లా పరిషత్ నంబర్-టు పాఠశాలలో హిందీ పరీక్ష రాస్తోంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి తిరిగి పరీక్ష రాయించారు.