News March 18, 2025
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థికి తీవ్రగాయాలు

ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరగగా.. ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. పట్టణంలో ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి ఓ తండ్రి తన కూతురిని బైక్‌పై తీసుకెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2025
బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.
News December 6, 2025
VJA: ఇండిగో సమస్య.. హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలివే.!

ఇండిగో విమాన ప్రయాణాలలో సమస్య తలెత్తడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఇండిగో హెల్ప్‌లైన్ నంబర్లలో లేదా డ్యూటీ టెర్మినల్ మేనేజర్‌ను 9493192531 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ నంబర్లలో ఇండిగో విమానాల తాజా సమాచారం లభిస్తుందన్నారు.
News December 6, 2025
మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.


