News November 15, 2024

ఆత్మకూరు: వైఎస్సార్ విగ్రహంపై దాడి

image

ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా విగ్రహానికి సమీపంలో ఉన్న సచివాలయం శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 15, 2024

అనంతపురంలో ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం

image

అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సంతోశ్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్  ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చోటే, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

News November 15, 2024

గుత్తి: డబుల్ రైల్వే లైన్‌కు భూముల పరిశీలన

image

గుత్తి-పెండేకల్లు రైల్వే డబుల్ లైన్ పనులు త్వరలో జరగనున్నాయి. వీటికి చెట్నేపల్లి సమీపంలోని భూములను కేటాయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం వీటిని పరిశీలించారు. మ్యాపులను వీక్షించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఓబులేసు, రైల్వే సెక్షన్ ఆఫీసర్ విమలేష్ కుమార్, సర్వేయర్ శేష సాయి తదితరులు పాల్గొన్నారు.

News November 15, 2024

SKUలో రేపు M.Tech స్పాట్ అడ్మిషన్స్ 

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.00 గంటలకు M.Tech స్పాట్ అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ఏపీపీజీఈసెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జీరాక్స్ కాపీలను కూడా తీసుకొని రావాలని సూచించారు.