News February 2, 2025

ఆత్మకూర్ : మేకలు, గొర్రెల దొంగల ముఠా అరెస్ట్

image

గోర్లు, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు కాప్రాయిపల్లి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLGజిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నాన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.  జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

వరంగల్ : అక్కడ సై.. ఇక్కడ నై..!

image

ఉమ్మడి WGL జిల్లా కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న మంత్రి కొండా సురేఖ-MLAల విభేదాలు పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విభేదాల కారణంగా ద్వితీయ శ్రేణి నేతలకు పదవులు రాకుండా అడ్డంకులు ఏర్పడుతున్నాయని భావన నెలకొంది. ఈ ఏడాది జనవరి 27న ప్రకటించిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి విభేదాల కారణంగా ప్రమాణ స్వీకారం జరగకముందే రద్దయింది. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసేలా చూడాలంటున్నారు.

News October 26, 2025

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <>సైట్‌<<>>లో టెన్త్ క్లాస్ రోల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే స్టూడెంట్ వివరాలు వస్తాయని చెప్పింది. ఏమైనా తప్పులుంటే రిక్వెస్ట్ లెటర్‌ను కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా ఈ నెల 28లోగా RIO ఆఫీసులో అప్లై చేసుకోవాలని సూచించింది. పేరు మార్పు కోసం బ్యాంకులో రూ.100 చలాన్ కట్టాలని చెప్పింది.

News October 26, 2025

ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

image

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.