News December 29, 2024

ఆత్మరక్షణ విద్యగా తైక్వాండో సాధన చేయాలి: టీజీ వెంకటేశ్

image

ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ విద్యగా టైక్వాండో సాధన ప్రతిరోజు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరం సాధన చేస్తే క్రమశిక్షణతో పాటు శారీరక అభివృద్ధి కలుగుతుందన్నారు.

Similar News

News January 6, 2025

గడివేముల: రూ. లక్షలు డిపాజిట్ అయ్యాయ్.. వేరే వారికి పంపే వీలు లేదు

image

రూ. 3.24 లక్షలు ఖాతాలోకి జమచేసి బ్యాంకు అకౌంట్ హ్యాక్ చేసే యత్నం గడివేములలో ఆదివారం జరిగింది. పరమేశ్ బ్యాంకు ఖాతాలోకి రూ. 3.24 లక్షలు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది, ఖాతాలోనూ చూపించింది. కానీ వేరే వారి ఖాతాకు పంపేందుకు చూస్తే కుదురలేదు. మరొకసారి బ్యాంకు ఖాతా చెక్ చేయగా.. డిపాజిట్ అయిన నగదుతో పాటు తన డబ్బులు రూ. 1.600 కూడా కట్ అయ్యాయి. బాధితుడు మోసాన్ని గుర్తించి అప్రమత్తమయ్యాడు.

News January 6, 2025

మా ఊరిని టాప్ వన్‌గా మారుస్తా: కర్నూలు MP

image

తన సొంత గ్రామం పంచలింగాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే టాప్ వన్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని కర్నూలు MP బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు పరిధిలోని పంచలింగాల ఎస్సీ కాలనీలో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. త్వరలోనే పంచలింగాల రూపు రేఖలు మారబోతున్నాయని ఎంపీ అన్నారు.

News January 6, 2025

ఆస్పరి: ఆడుకుంటూ నిప్పు అంటించుకున్న చిన్నారులు

image

ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు బైక్‌లో పెట్రోల్‌ను బాటిల్లోకి తీసుకొని, ఒకరిపై ఒకరు చల్లుకొని నిప్పు అంటించుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.