News February 11, 2025

ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి స్నేహితుల అండ

image

ఇటీవల రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి కుటుంబానికి ఆయన స్నేహితులు రూ. 45.68 లక్షల సాయం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన స్నేహితులు కలిసి రూ. 45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని మూర్తి భార్య విజయకు చెక్కు రూపంలో సోమవారం అందజేశారు.

Similar News

News November 27, 2025

కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

image

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం కుముదవల్లి రైతు సేవా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తేమ శాతం లెక్కింపు, గోనె సంచుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని ఆమె సూచించారు. జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.