News July 25, 2024
ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

విజయవాడలో మంత్రులు, ఎమ్మెల్యేల గౌరవార్థం గురువారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
Similar News
News October 28, 2025
GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
News October 27, 2025
గుంటూరు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీస్ (24×7) కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
@జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0863-2230100
@ఈస్ట్ సబ్‌డివిజన్–0863-2223353
@వెస్ట్ సబ్‌డివిజన్– 0863-2241152 / 0863-2259301
@నార్త్ సబ్‌డివిజన్–08645-237099
@సౌత్ సబ్‌డివిజన్–0863-2320136
@తెనాలి సబ్‌డివిజన్–08644-225829
@తుళ్లూరు సబ్‌డివిజన్–08645-243265
News October 27, 2025
ANU పరిధిలోని కాలేజీలకు సెలవు

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మొంథా తుఫాను నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలకు ఈ నెల 29 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


