News April 8, 2025
ఆత్రేయపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో లారీ ఢీకొని గుర్తుతెలియని యువకుడు మంగళవారం మృతి చెందాడు. ఏపీ 37 3865 నంబర్ కలిగిన బైక్పై వెళ్తున్న యువకుడిని ఇసుక లోడుకు వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఆత్రేయపురం పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 1, 2025
GNT: నేటికి 41ఏళ్లు.. మొదటి లోకాయుక్త మన వారే.!

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వ్యవస్థ 1983 నవంబర్ 1న ఏర్పాటయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ. మొదటి లోకాయుక్తగా అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు నియమితులయ్యారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. కాగా ఆయన మన ఉమ్మడి గుంటూరు జిల్లా మూల్పూరులో జన్మించారు.
News November 1, 2025
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.
News November 1, 2025
ADB: జూబ్లీ పోరు.. మనోళ్ల ప్రచార జోరు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి జిల్లా నుంచి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ADB నుంచి కాంగ్రెస్ నేత, మంత్రి వివేక్ వెంకటస్వామి,బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, బాల్క సుమన్ తదితర నేతలు ప్రచారం జోరు పెంచారు. వీరితోపాటు మండల నేతలను తీసుకెళ్లడంతో ఎంత ప్రభావం చూపుతారోననే ఆసక్తి నెలకొంది.


