News March 19, 2025

ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలకు ఆహ్వానం : డీఈవో రాము

image

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26కు తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు. 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వీకరణకు చివరి తేదీ ఈనెల 20. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 21. పరీక్ష తేదీ 27. 

Similar News

News January 8, 2026

సిద్దిపేట: ఉక్కుపాదం మోపిన CP

image

గతేడాది Oct 6న సిద్దిపేట CPగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ తన మార్కును చూపించారు. అక్రమ ఇసుక, గంజాయి, డ్రగ్స్ రవాణ చేసే వారిపై కేసులు నమోదు చేసి, వారిపై ఉక్కుపాదం మోపారని జిల్లా వాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన మందుబాబులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.10 వేల జరిమాన, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టారు.

News January 8, 2026

మైనర్ షూటర్‌కు లైంగిక వేధింపులు.. బెడ్‌పైకి లాక్కెళ్లి..

image

నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై లైంగిక వేధింపుల <<18795742>>కేసులో<<>> బాధితురాలు(మైనర్) కీలక విషయాలు వెల్లడించారు. ‘గేమ్ అనాలసిస్ పేరుతో 5స్టార్ హోటల్‌కు పిలిచాడు. కుర్చీలో కూర్చున్న నన్ను బలవంతంగా బెడ్‌పైకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడు. నేను ప్రతిఘటించడంతో కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడు. పైగా తనతో బాగా నడుచుకోవాలన్నాడు. జరిగిన విషయాన్ని అమ్మకు చెప్పడంతో PSకు తీసుకొచ్చింది’ అని తెలిపారు.

News January 8, 2026

రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

image

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.