News July 17, 2024
‘ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయి’
ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయని ఖమ్మం ఆదాయపన్ను అధికారి ఉమామహేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీడీవోలకు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుపై ఆదాయపన్ను అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయపన్ను ముఖ్య ఆదాయ వనరులని, ఆదాయపన్ను క్రింద వసూలయ్యే ప్రతి పైసా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చవుతుందన్నారు.
Similar News
News December 1, 2024
పాడి పశువుల పెంపకానికి చేయూత: భద్రాద్రి కలెక్టర్
పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు.
News December 1, 2024
రైతు పండుగ విజయవంతం పట్ల తుమ్మలకు పీసీసీ చీఫ్ అభినందనలు
రైతు పండుగ కార్యక్రమం విజయవంతం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసంలో ఆదివారం పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. రైతాంగంకు ఆధునిక సాగు పద్ధతులు యాంత్రీకరణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై రైతు భరోసా పై యావత్ తెలంగాణ కు స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.
News December 1, 2024
సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పిస్తాం: ఎంపీ RRR
అమెరికా కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్‌కు చెందిన <<14750277>>సాయితేజ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ రఘురాంరెడ్డి ఫోన్లో సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా పంపించాలని వీదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు.