News September 5, 2024
ఆదిమూలం బాధితులు చాలా మంది ఉన్నారు: వరలక్ష్మి
సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం తనకు పదే పదే వీడియో కాల్స్ చేసేవారని బాధిత మహిళ వరలక్ష్మి ఆరోపించింది. ‘ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే నా నంబర్ తీసుకున్నాడు. తిరుపతిలోని ఓ హోటల్లో నాపై 3 సార్లు అత్యాచారం చేశాడు. నాలాగే సత్యవేడులో చాలా మంది ఆయన బాధితులు ఉన్నారు. వాళ్ల తరఫున నేను పోరాటం చేస్తా. అందుకే పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. నన్ను చంపేస్తానని బెదిరించడంతోనే మీడియా ముందుకు వచ్చా ’ అని వరలక్ష్మి చెప్పారు.
Similar News
News September 14, 2024
తిరుమలలో సమాచారం@ 7AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని టీటీడీ తెలిపింది. శనివారం ఉదయం 7గంటల సమయానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్తున్న వారికి 12 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు. శని,ఆదివారాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి సేవకు హాజరైనట్లు తెలుస్తోంది.
News September 14, 2024
చిత్తూరు SP స్ట్రాంగ్ వార్నింగ్
ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మొగిలిలో ప్రమాద ఘటనను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రహదారి లోపాలను సరిదిద్దడం, భారీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News September 14, 2024
చిత్తూరు జిల్లా రైతులకు గమనిక
చిత్తూరు: సరైన వర్షపాతం లేని కారణంగా పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. పంట నష్ట నివారణకు జిల్లా రైతాంగం వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. రెండు శాతం యూరియా ద్రావణం, 10రోజల వ్యవధిలో 19-19-19 ఎరువును రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. స్పింకర్ల ద్వారా నీరు పిచికారీ చేయాలన్నారు.