News September 9, 2024
ఆదిమూలానికి న్యాయం చేయాలని వినతి
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ చేసి ఆయనకు న్యాయం చేయాలని దళిత నాయకులు కోరారు. ఈ మేరకు తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఆదిమూలం ఉన్నారని చెప్పారు. అలాంటి వ్యక్తిపై కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు.విచారణ జరిపించి కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News October 4, 2024
తిరుపతి SVU ఫలితాల విడుదల
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(BED) మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News October 4, 2024
పవన్ స్పీచ్‌లో తమిళ ప్రస్తావన ఎందుకు..?
తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ ప్రస్తావనపై చర్చ జరుగుతోంది. లడ్డూ వివాదం తమిళనాడులోని ఓ కంపెనీ చుట్టూ తిరుగుతోంది. మరోసారి తమిళనాడుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అక్కడి రాజకీయాల్లో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా స్పందించారా అని అందరూ భావిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
News October 4, 2024
శ్రీకాళహస్తిలో రూమ్స్ కావాలంటే ఇలా చేయండి
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వసతి గదులను ఇప్పటి వరకు సాధారణ బుకింగ్ ద్వారా భక్తులకు ఇచ్చారు. ఇక మీదట గదులు కావాలంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. గదులు కావాల్సినవారు స్వయంగా వచ్చి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డుతో గదులను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.