News June 4, 2024
ఆదిరెడ్డి వాసు, అయితాబత్తుల ఆనందరావు ముందంజ

రాజమండ్రి సిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్పై 3వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు. అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు ముందంజలో కొనసాగుతున్నారు.
Similar News
News September 15, 2025
మంత్రి కందులను కలిసిన తూ.గో కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విజయవాడలో మంత్రి కందుల దుర్గేశ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, సినీ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు.
News September 15, 2025
తూ.గో: నేడు కలెక్టరేట్లో PGRS

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.
News September 14, 2025
రాజమండ్రి ఎంపీకి 7వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో రాజమండ్రి ఎంపీ పురందీశ్వరికి 13వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 73 ప్రశ్నలు అడగటంతో పాటు 13 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.