News August 15, 2024

ఆదిలాబాద్‌‌కు చేరుకున్న షబ్బీర్ అలీ

image

స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించడాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ అలం ఘనంగా స్వాగతం పలికారు. 

Similar News

News September 8, 2024

లోకేశ్వరం: ఎలుకల మధ్యలో గణనాథుడు

image

లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో మున్నూరు కాపు సంఘం యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎలుకలు లంబోదరుడిని ఎగరేసి పట్టుకున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 11 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు.

News September 7, 2024

కుబీర్: వినాయక చవితికి స్పెషల్ ఈ కర్ర గణపతి

image

వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్‌లో  అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్‌లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.

News September 7, 2024

నిర్మల్: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై మండల తాహశీల్దార్‌లతో ఆమె సమీక్షించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.