News April 24, 2024
ఆదిలాబాద్‌కు CM వరాల జల్లులు.. ఇవే

ఆదిలాబాద్ జిల్లావాసులకు సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నాగోబా జాతరకు రూ.4 కోట్ల కేటాయించాలని నిర్ణయించామన్నారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ముక్తి ప్రాజెక్టును కట్టి.. ఆదిలాబాద్‌కు నీళ్లిస్తామని హామీఇచ్చారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి అంబేడ్కర్ పేరు పెడుతామన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు, CCI తెరిపిస్తామన్నారు.
Similar News
News October 16, 2025
ADB: మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి లక్ష్యాలు, సన్నద్ధత, ప్రోత్సాహక విషయాలపై పలు సూచనలు చేశారు.
News October 15, 2025
డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు యువతకు ఆహ్వానం: ADB SP

జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మొదటి విడత 5 మండలాలలో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. ఈ నెల 18 వరకు వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ లేదా మీసేవ సెంటర్లలో రుసుములు చెల్లించాలని కోరారు. నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, భీంపూర్ మండలాల యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
News October 15, 2025
సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు. ఈ సర్వే లింక్‌ను, QR కోడ్‌ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.