News July 4, 2024

ఆదిలాబాద్‌లో కత్తిపోట్లకు దారి తీసిన ఘటన

image

ఆదిలాబాద్‌లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కాలనీకి చెందిన రాహుల్ పై ఇమ్రాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్ఐ ముజాహిద్ తెలిపారు. వెంటనే స్థానికులు అతడిని రిమ్స్‌కి తరలించారు. ఇమ్రాన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News November 24, 2025

ADB: రిజర్వేషన్ల ప్రక్రియ పునఃపరిశీలన

image

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదని, అదే సమయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేశారు.

News November 24, 2025

ADB అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

image

ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని రేపట్లోగా పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన 982 రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు.

News November 24, 2025

ADB: మనకే పదవి వస్తుందనుకున్నాం.. కానీ

image

డీసీసీ అధ్యక్షుల ఎంపికతో కాంగ్రెస్‌లో సీనియర్లు నిరాశకు లోనయ్యారు. తమకే పదవి వస్తుందని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని భావించారు. జిల్లాలో గోక గణేశ్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, ఆడే గజేందర్ వంటివారు అధ్యక్ష పీఠంపై కన్ను వేశారు. కానీ అధిష్టానం వారిని కాదని నరేశ్ జాదవ్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన నేతలు, వారి అభిమానులు నిరాశలో ఉన్నారు.