News July 3, 2024

ఆదిలాబాద్‌లో కూలర్ షాక్ కొట్టి బాలుడి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ఓ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో ఓ ఇంటి యజమాని ఇంటి బయట మురికి కాలువపై కూలర్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గోపాల్ (14) పిల్లలతో కలిసి బుధవారం ఆడుకుంటూ కూలర్‌ను ముట్టుకోవడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 11, 2024

ఆదిలాబాద్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

2024- 25 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హుడైన విద్యార్థి పేరు SSC మెమోలో ఉన్న విధంగా ఆధార్ కార్డులో ఉండాలన్నారు. విద్యార్థుల ఆదాయపరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచామని చెప్పారు.

News October 11, 2024

ADB: దమ్మ పరివర్తన దివస్ సందర్భంగా ఆమ్లాకు ప్రత్యేక రైలు

image

దమ్మ పరివర్తన దినోత్సవం నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నాందేడ్- ఆమ్లా- నాందేడ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక రైలు (నం.07025) నాందేడ్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుందని, అదేవిధంగా శనివారం ప్రత్యేక రైలు (నం. 07026) ఆమ్లా నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో సైతం ఆగుతాయని తెలిపారు.

News October 11, 2024

భైంసా: ఆర్టీసీ డ్రైవర్ MISSING

image

ఆర్టీసీ డ్రైవర్ అదృశ్యమైన ఘటన భైంసాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎండీ.గౌస్ ఉద్దీన్ వివరాల ప్రకారం.. శివాజీనగర్‌కు చెందిన శామంతుల సుదర్శన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదాయానికి మించి అప్పులు కావడంతో కనిపించకుండా పోయాడు. కాగా ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్న నా మరణానికి ఎవరూ కారణం కారు’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి వెళ్లి పోయాడు. భార్య అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.