News May 8, 2024

ఆదిలాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్

image

ఆదిలాబాద్ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉట్నూర్‌కి చెందిన ఓ యువతి ఈ నెల 4న ఇంటికి వెళ్తానని ప్రిన్సిపల్‌కి సెలవు పత్రం ఇచ్చి కాలేజీ నుంచి బయటికి వచ్చింది. అయితే బుధవారం ఆమె తండ్రి తనను చూడడానికి కాలేజీకి వెళ్లడంతో విషయం బయటపడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ CI అశోక్ తెలిపారు.

Similar News

News January 19, 2025

ADB: విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

image

విద్యుదాఘాతంతో బాలిక తీవ్ర గాయాలపాలైన ఘటన శనివారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన షేక్ తహ్రీం ఇంటి స్లాబ్ పై వెళ్లగా పైనుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో షాక్ కొట్టింది. దీంతో ఆమె చేయి, కాలుతో పాటు శరీరం ఒక పక్క దాదాపు 40 శాతం కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు స్ధానిక రిమ్స్‌కు తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News January 18, 2025

‘రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి’

image

 రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జట్టుకు శనివారం  క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. 

News January 18, 2025

ఈ యాప్‌తో నిరుద్యోగులకు ఎంతో మేలు: కలెక్టర్

image

నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్‌లో కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అధికారులు ఈ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. డైట్ యాప్‌లో తమ విద్యార్హతలతో పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని చెప్పారు.