News March 7, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదన్నారు.
Similar News
News March 10, 2025
జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
News March 9, 2025
ADB: MLC రేసులో రేఖానాయక్?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే
News March 9, 2025
ADB: నేటి నుంచి గ్లాకోమా వారోత్సవాలు

ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.