News January 27, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,060గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

Similar News

News February 16, 2025

ఆదిలాబాద్: 8 గంటల నుంచి 4 వరకు పోలింగ్

image

ఈనెల 27న నిర్వహించే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలీంగ్ స్టేషన్ లను పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 220 మంది, జోనల్ ఆఫీసర్లు 9 మందిని కేటాయించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.

News February 15, 2025

జన్నారం: స్వగ్రామానికి చేరిన మల్లేశ్ మృతదేహం

image

ఇటీవలే ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందిన జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేశ్ మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కవ్వాల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతదేహంపై పడి భార్య రోదిస్తుంటే గ్రామంలోని వారందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ గల్ఫ్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.

News February 15, 2025

నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

image

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్‌లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!