News February 25, 2025

ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News December 13, 2025

ఆదిలాబాద్: రేపే పోలింగ్.. ఏకగ్రీవమైన పంచాయతీలు ఇవే

image

ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో 2వ విడత పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, హత్తిగుట్ట, చాంద్ పల్లి, అడ, పూసాయి, మార్కగూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్, పార్డి (బి), జంబుల్ దరి, లింగు గూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.

News December 13, 2025

తిరుపతిలో కాలేజీ లెక్చరర్ సస్పెండ్

image

తిరుపతిలోని SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత పాఠాలు చెప్పిన కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ మాధవిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థులకు <<18550600>>అన్యమత పాఠాలు <<>>చెప్పడంపై Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన ప్రిన్సిపల్ వెంటనే ఆమెను విచారించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమె గతంలోనూ ఇలాంటివి చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు.

News December 13, 2025

Stay Safe: రేపు, ఎల్లుండి కోల్డ్ వేవ్స్

image

తెలంగాణలో రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ తీవ్రమైన శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంది. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.