News February 25, 2025

ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News March 19, 2025

MBNR: GREAT.. ఓపెన్‌లో GOVT జాబ్ కొట్టాడు..!

image

TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో పాలమూరు విశ్వవిద్యాలయం పరిధి గద్వాలలోని పీజీ సెంటర్‌లో 2017-2019లో MA తెలుగు పూర్తి చేసిన S.రాకేశ్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటి ఓపెన్‌లో ఉద్యోగం సాధించారు. దీంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC), ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ రాకేశ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, తెలుగు శాఖ అధ్యక్షురాలు డా.సంధ్యారాణి పాల్గొన్నారు.

News March 19, 2025

VKB: CMకు ‘THANK YOU’ చెప్పిన ఎమ్మెల్యేలు

image

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.6000 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌‌కు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.

News March 19, 2025

రాష్ట్రస్థాయి పైలట్ ప్రాజెక్టులో కొలనూర్ గ్రామం

image

ఓదెల మండలంలోని కొలనూర్ గ్రామానికి రైతు గుర్తింపు కార్డుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనట్టు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తుందని తెలిపారు అందులో భాగంగా రేపు కొలనూరు రైతువేదికలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు ఆధార్ కార్డు, భూమిపట్టా పాస్‌బుక్ తీసుకొని రావాలని సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు

error: Content is protected !!