News February 25, 2025
ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.
Similar News
News February 24, 2026
8వ తరగతి బుక్‌పై వివాదం

వచ్చే విద్యా సం. కోసం 8వ తరగతి సోషల్ బుక్‌లో NCERT చేసిన కొన్ని మార్పులపై వివాదం రాజుకుంది. ‘సమాజంపై న్యాయవ్యవస్థ ప్రభావం’ టాపిక్‌లో కొత్తగా ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశాన్ని చేర్చారు. ప్రజలకు జుడీషియరీపై తప్పుడు ఉద్దేశం ఏర్పడుతుందని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక స్వాతంత్ర్య ఉద్యమ టాపిక్‌లో.. దేశ విభజనను తొలుత కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ, చివరికి తప్పక అంగీకరించిందని కొత్తగా చేర్చింది.
News February 24, 2026
HYD: 3 కార్పొరేషన్ల వెబ్‌సైట్లు ఇవే!

300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలైన విషయం తెలిసిందే. GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్‌సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్‌సైట్లలో ప్రజలు సేవలు పొందొచ్చని అధికారులు తెలియజేశారు.
# SHARE IT
News February 24, 2026
మేడ్చల్: రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు!

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. పరీక్షల నిర్వహణకు 182 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 64,780 ఒకేషనల్ కోర్సులో 1,368 మంది, సెకండ్ ఇయర్ 67,792 జనరల్ విభాగం, ఒకేషనల్ విభాగంలో 1,258 మంది విద్యార్థులు పరీక్ష రాయలున్నారు. కావాల్సినన్నీ సిద్ధంచేసుకుని కూల్‌గా ఉండటానికి ప్రయత్నించండి.


