News April 8, 2025

ఆదిలాబాద్‌లో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

image

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Similar News

News October 27, 2025

మొంథా తుపాన్: విజయనగరానికి రూ.కోటి

image

మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు రూ.కోటి, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ. 50లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో తీర ప్రాంతం ఉండడంతో నష్టం అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నిధులను రూ.కోటి మంజూరు చేసింది. ఆయా నిధులను నష్టం నివారణకు ఖర్చు చేయాల్సి ఉంది.

News October 27, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16 వేలు, వండర్ హాట్ (WH) మిర్చి రూ.16,600 పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15 వేలు పలికింది. మక్కలు(బిల్టీ)కి రూ.2050 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News October 27, 2025

నగరంలో ఉ‘సిరి’కి భారీ డిమాండ్

image

నగరంలో చాలా ప్రాంతంలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం అవడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వనస్థలిపురం రైతుబజారులో 250గ్రా. ఉసిరి రూ.30- ₹50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50- ₹80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.