News April 8, 2025

ఆదిలాబాద్‌లో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

image

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Similar News

News April 24, 2025

అమీన్పూర్: తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సెలవులలో ఎవరైనా పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

News April 24, 2025

NZB: భూ సమస్యల పరిష్కారానికి నూతన చట్టం: కలెక్టర్

image

భూభారతి చట్టం ద్వారా రైతుల, ప్రజల సమస్యలు తీరుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి భీంగల్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

శంకరపట్నం: భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన

image

శంకరపట్నం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో భూభారతి ఆర్‌ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి హాజరై మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టం ద్వారా భూ హక్కులపై కొన్ని కొత్త సవరణలు, విచారణ అధికారం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!