News September 27, 2024

ఆదిలాబాద్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు కొనసాగించడానికి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP గౌష్ ఆలం తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో DSP ఆపై స్థాయి అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 4, 2024

ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఆర్థిక మోసలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనపు కలెక్టర్ దాసరి వేణు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఏజీఎం రాధికభరత్ లతో కలిసి ఆర్థిక మోసాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు ఓటిపిలు ఎవరికి చెప్పవద్దని, అపరిచిత ఫోన్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 4, 2024

ఆదిలాబాద్: అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 163 ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలల్లో బాలికల ఆత్మరక్షణ సాధనకై సుశిక్షితులు అయిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఈవో ప్రణీత తెలిపారు. దరఖాస్తుదారులు https://forms.gle/KWHjcwmyrCoodwWm9 లింక్
ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. శిక్షకులను జిల్లా కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఈనెల 8న డిఈఓ ఆఫీసులో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

News October 3, 2024

వరి కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎం

image

ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ రాజర్షిషా, గౌస్ ఆలం పాల్గొన్నారు. అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే DSC అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.