News March 16, 2025
ఆదిలాబాద్లో AIRPORT.. AI PHOTO

ADBలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 7, 2025
గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News December 7, 2025
ADB: ఏడాదికోసారి ఎలక్షన్ వస్తే ఎంత బాగుంటుందో..!

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు అభ్యర్థుల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి ‘కాస్ట్లీ మందు కావాలి’, ‘వారసంతకు వెళ్లాలి’, ‘ఇంట్లో సామాన్ లేదు’ అంటూ అభ్యర్థులను డబ్బుల కోసం అడుగుతున్నారు. ఇక దావతులు, పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు వస్తే ఇంట్లో దోకా ఉండదని, తమ ఖర్చులన్నీ వసూలు చేసుకోవచ్చని పలువురు బహిరంగంగా చెబుతున్నారు.
News December 7, 2025
నేడు ప.గో నుంచి ప్రత్యేక రైలు

ప.గో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నేటి నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రైలు నంబర్ 01781 చర్లపల్లిలో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు బయలదేరి 8న రాత్రి 11:50 గంటలకు షాలిమారుకు చేరుకుంటుంది. తిరిగి చర్లపల్లికి( 01782) 10వ తేదిన సాయంత్రం 4 గంటలకు రానుంది. ఈ ట్రైన్ ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా నడుస్తుంది.


