News March 16, 2025
ఆదిలాబాద్‌లో AIRPORT.. AI PHOTO

ADBలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 14, 2026
జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.
News March 14, 2026
మంచిర్యాల: జిల్లాలో గ్యాస్ కొరత లేదు

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పిజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల కొరతలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు.
News March 14, 2026
BHPL: సింగరేణి ముస్లిం ఉద్యోగులకు GOOD NEWS

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 అడ్వాన్స్ కింద ఈ నెల 18న బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ అడ్వాన్స్‌ను ఏప్రిల్ నెల వేతనాల నుంచి ప్రారంభించి 10 సమాన నెలవారీ వాయిదాల్లో తిరిగి రికవరీ చేసుకోనుంది.


