News March 16, 2025
ఆదిలాబాద్‌లో AIRPORT.. AI PHOTO

ADBలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News April 12, 2026
NZB: చర్చనీయంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతల వైఖరితో విసిగిపోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, గతంలో పోచారంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇక్కడి నేతలు జీవన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు.
News April 12, 2026
నేడు MNCLకు కేటీఆర్.. గులాబీ దళంలో జోష్

మంచిర్యాల జిల్లాలో నేడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటన రాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మారుతున్న సమీకరణల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అదే ఊపుతో వచ్చే ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేసేలా కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
News April 12, 2026
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున నం.18519/20 విశాఖపట్నం- LTT ముంబై ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించామని రైల్వే అధికారులు తెలిపారు. మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు విజయవాడ- ఖాజీపేట- పగిడిపల్లి మీదుగా కాక విజయవాడ- గుంటూరు- పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయని, మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లకు ఖాజీపేటలో స్టాప్ తొలగించామని అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


