News July 19, 2024
ఆదిలాబాద్లో CM ప్రారంభించేవి ఇవే..!

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పర్యటించనున్నారు. కాగా జిల్లాలో సీఎం ప్రారంభించే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్, ఎంఆర్ఐ మిషన్ ప్రారంభించనున్నారు. అలాగే కేజీబీవీ హైస్కూల్, బంగారి గూడ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్నారు. వీటితో పాటు మదర్ పౌల్ట్రీ యూనిట్లను ఓకే చోట బటన్ నొక్కి ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 24, 2025
ADB: మనకే పదవి వస్తుందనుకున్నాం.. కానీ

డీసీసీ అధ్యక్షుల ఎంపికతో కాంగ్రెస్లో సీనియర్లు నిరాశకు లోనయ్యారు. తమకే పదవి వస్తుందని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని భావించారు. జిల్లాలో గోక గణేశ్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, ఆడే గజేందర్ వంటివారు అధ్యక్ష పీఠంపై కన్ను వేశారు. కానీ అధిష్టానం వారిని కాదని నరేశ్ జాదవ్కు బాధ్యతలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన నేతలు, వారి అభిమానులు నిరాశలో ఉన్నారు.
News November 23, 2025
OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్ రాజర్షి షా

కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రైతులు తమ సందేహాల నివృత్తికి 6300001597 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.
News November 23, 2025
ఆదిలాబాద్ కాంగ్రెస్ కొత్త సారథి నేపథ్యమిదే

ADB కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్ మండలానికి చెందిన నరేశ్ జాదవ్ నియమితులైన విషయం తెలిసిందే. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. AICC మెంబర్గా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలనుకున్నా టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీలోనే కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయతతోనే అధ్యక్ష పదవి వచ్చింది.


